![]() |
![]() |

`మజిలీ`, `వెంకిమామ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకుని ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. త్వరలోనే ఈ యంగ్ హీరో.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన `లవ్ స్టోరి`తో పలకరించబోతున్నాడు. ఆపై వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తున్న `థాంక్ యూ`తోనూ సందడి చేయనున్నాడు. ఇక ఏడాది చివరలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `లాల్ సింగ్ చద్ధా`తో పలకరించబోతున్నాడు. ఇందులో బాల అనే ఆర్మీ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు చైతూ.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. చైతూ గత చిత్రం `వెంకిమామ`లోనూ తనది ఆర్మీ ఆఫీసర్ రోల్ నే. అందులోని పాత్రకి భిన్నంగా `లాల్ సింగ్ చద్ధా`లో చేస్తున్న క్యారెక్టర్ ఉంటుందని టాక్.
ఇదిలా ఉంటే.. చైతూ తొలిసారిగా సైనికుడి పాత్రలో కనిపించిన `వెంకిమామ` ఎలాగైతే డిసెంబర్ నెలలో విడుదలైందో.. మలిసారి జవాన్ పాత్రలో దర్శనమివ్వనున్న `లాల్ సింగ్ చద్ధా` కూడా డిసెంబర్ మాసంలోనే రిలీజ్ కానుంది. చైతూ మేనమామ విక్టరీ వెంకటేశ్ బర్త్ డే స్పెషల్ గా 2019 డిసెంబర్ 13న `వెంకిమామ` సందడి చేస్తే.. 2021 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న `లాల్ సింగ్ చద్ధా` రాబోతోంది. మరి.. నాగచైతన్య మరోసారి ఆర్మీ ఆఫీసర్ గా అలరించడమే కాకుండా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |