![]() |
![]() |

దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సముద్రకని.. ప్రస్తుతం నటుడిగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరీముఖ్యంగా.. ఏడాది గ్యాప్ లో `అల వైకుంఠపురములో`, `క్రాక్` చిత్రాలతో ప్రతినాయకుడిగా రెండు ఘనవిజయాలను చూశాడీ టాలెంటెడ్ యాక్టర్. త్వరలో బడా మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో పలకరించబోతున్నాడు సముద్రకని. అయితే, ఇందులో తన పాత్రేంటో ఇంకా క్లారిటీ రాలేదు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వ్యతిరేక ఛాయలున్న పాత్రలోనే తను కనిపించబోతున్నాడని తెలిసింది. మరోవైపు.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `సర్కారు వారి పాట`లోనూ సముద్రకని నెగటివ్ రోల్స్ లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో బిగ్ టికెట్ ఫిల్మ్ కి సముద్రకని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ చిత్రం మరేదో కాదు.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి రీమేక్ గా తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా. త్వరలోనే `లూసిఫర్` రీమేక్ లో సముద్రకని ఎంట్రీపై క్లారిటీ రానుంది.
విశేషమేమిటంటే.. ఇప్పటికే అల్లు అర్జున్ తో `అల వైకుంఠపురములో` అలరించిన సముద్రకని.. ఆపై `ఆర్ ఆర్ ఆర్`లో రామ్ చరణ్ తో.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి సందడి చేయనున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు చిరుతోనూ `లూసిఫర్` రీమేక్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. మొత్తమ్మీద.. మెగాకాంపౌండ్ ని రౌండప్ ని చేసే పనిలో బిజీగా ఉన్నాడు సముద్రకని. మరి.. `అల వైకుంఠపురములో` తరహాలో రాబోయే మెగా కాంపౌండ్ మూవీస్ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసి నటుడిగా సముద్రకని స్థాయిని మరింత పెంచుతాయేమో చూడాలి.
![]() |
![]() |