![]() |
![]() |

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రామ్, పూరీ లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఈ మూవీతో నిధి అగర్వాల్ కూడా యూత్ లో క్రేజ్ సంపాదించడంతో పాటు బిజీ హీరోయిన్ మారిపోయింది. అందుకేనేమో అమ్మడికి ఈ సినిమాపై ప్రత్యేక అభిమానం ఉంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని, అందులో కూడా రామే నటించాలని అంటోంది.
'ఇస్మార్ట్ శంకర్' మూవీ రిలీజై రెండేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిధి అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హాట్ కామెంట్స్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ ను హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. హిందీ లో రీమేక్ చేస్తే రామ్ మాత్రమే ఆ పాత్రను చేయాలని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రామ్ తప్ప మరొకరు ఆ పాత్రకు న్యాయం చేయలేరని.. అందుకే రామ్ కే ఆ పాత్రను ఇవ్వాలని తాను కోరుకుంటాన్నానని తెలిపింది. ఇస్మార్ట్ శంకర్ హిందీలో రీమేక్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని.. అంతకంటే ఆ సినిమా గురించి పెద్దగా చెప్పలేను అని నిధి అగర్వాల్ పేర్కొంది.
నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా లో నటిస్తోంది. అలాగే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ 'హీరో' లోనూ నటిస్తోంది.
![]() |
![]() |