![]() |
![]() |

బయోగ్రాఫికల్ డ్రామా 'మేజర్' షూటింగ్‌ను పునరుద్ధరించాడు అడివి శేష్. దాని తర్వాత 'హిట్ 2', 'గూఢచారి 2' సినిమాల మీద ఫోకస్ పెట్టనున్నాడు. ఎక్కువగా థ్రిల్లర్స్ చేస్తూ వస్తున్న అతను ఇంతదాకా ఔట్-అండ్-ఔట్ రొమాంటిక్ మూవీని చేయలేదు. 2017లో ఈషా రెబ్బాతో 'అమీ తుమీ' సినిమా చేశాడు కానీ అది పూర్తి స్థాయి రొమాంటిక్ ఫిల్మ్ కాదని అతనంటాడు. "అది 'అందాజ్ అప్నా అప్నా' తరహా స్లాప్‌స్టిక్ కామెడీ. అది ఫన్ ఫిల్మ్." అని అతను చెప్పాడు.
ఒక ప్రేక్షకునిగా గాఢమైన లవ్ స్టోరీలు చూడ్డానికి అతను బాగా ఇష్టపడతాడు. "నాకు క్యాండీఫ్లాస్ తరహా లవ్ స్టోరీలంటే అంతగా నచ్చవు. నా దృష్టిలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అంటే 'షోలే'లో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల లవ్ స్టోరీనే. హేమమాలిని-ధర్మేంద్ర లవ్ స్టోరీ కంటే వాళ్ల లవ్ స్టోరీయే నాకు బాగా నచ్చుతుంది. అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాను." అని చెప్పాడు శేష్.
'గూఢచారి' (2018) సీక్వెల్ ఆలస్యం అవడానికి తనవైపు కూడా కొంత తప్పు ఉందని అతనంటాడు. "'గూఢచారి' రిలీజయ్యాక వెంటనే 'గూఢచారి 2' చేద్దామనుకున్నా. తర్వాత ఆ యూనివర్స్ నుంచి కొంత కాలం దూరంగా ఉండాలనిపించింది. అప్పుడు 'మేజర్' లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చింది. దానికి తోడు మహమ్మారి రావడంతో 'గూఢచారి 2' బాగా ఆలస్యమవుతోంది. అంతే తప్ప ఇది కావాలని చేసింది కాదు. మెయిన్ స్టోరీ పూర్తయింది. 'మేజర్' షూటింగ్ పూర్తవగానే, 'గూఢచారి 2' స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే మీద దృష్టి పెడతాను." అని స్పష్టం చేశాడు.
![]() |
![]() |