![]() |
![]() |

విలక్షణమైన నటనతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి. భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సేతుపతి.. త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్ గా 'మాస్టర్ చెఫ్' అనే కార్యక్రమం త్వరలోనే తమిళంలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసినట్లు సేతుపతి పేర్కొన్నారు.
చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి అర్థరాత్రి 12 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేసే వాడినని.. ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లని సేతుపతి చెప్పాడు. అక్కడే రాత్రి భోజనం కూడా తినేవాడినని.. డబ్బులతో పాటు ఆకలి కూడా తీరుతుందనే కారణంతో అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చాలాకాలం పనిచేశానని తెలిపారు. ఇక తనకు ఉల్లి సమోసా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుతం అది ఎక్కడా దొరకడం లేదని అన్నారు. దీంతో ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా ఉల్లి సమోసా చేసుకొని, టీ తాగుతూ తింటానని చెప్పాడు.
![]() |
![]() |