![]() |
![]() |

పుష్కరకాలం క్రితం విడుదలైన `అలాదిన్`(2009)తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండెజ్.. అనతికాలంలోనే హిందీనాట అగ్ర కథానాయికగా ఎదిగింది. పలువురు స్టార్ హీరోలతో ఆడిపాడి వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. అడపాదడపా ప్రత్యేక గీతాల్లోనూ, అతిథి పాత్రల్లోనూ కనిపిస్తూ అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఉత్తరాదిలో విజయబావుటా ఎగురవేసిన జాక్వలైన్.. ప్రస్తుతం దక్షిణాదిపై కూడా దృష్టి సారిస్తోంది. ఆ మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ - ఇండియా మూవీ `సాహో`లో ``బ్యాడ్ బాయ్`` పాటలో తన స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ హాట్ బ్యూటీ.. త్వరలో రెండు దక్షిణాది చిత్రాలతో సందడి చేయనుంది. ఆ రెండు కూడా బిగ్ టికెట్ ఫిల్మ్స్ నే కావడం విశేషం. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు` కాగా.. మరొకటి కన్నడ స్టార్ సుదీప్ నటిస్తున్న `విక్రాంత్ రోనా`. పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`లో ఇద్దరు నాయికల్లో ఒకరిగా కనిపించనున్న జాక్వలైన్.. త్రీడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ `విక్రాంత్ రోనా`లో అతిథి పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు భారీ చిత్రాలు కూడా పలు భాషల్లో విడుదల కానుండడం.
మరి.. దక్షిణాది చిత్రాల్లో జాక్వలైన్ మెరుపులు.. ఆయా సినిమాలకు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |