![]() |
![]() |

`జనతా గ్యారేజ్` (2016) వంటి సంచలన చిత్రం తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా వెంచర్ గా సందడి చేయనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ రెండో వారంలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి `జనతా గ్యారేజ్`కి ఛాయాగ్రహణం అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునే రిపీట్ చేయనున్నారట కొరటాల. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని టాక్. త్వరలోనే `ఎన్టీఆర్ 30`లో తిరు ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. `ఎన్టీఆర్ 30`కి `జనతా గ్యారేజ్` ఛాయాగ్రహకుడు తిరు టచ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, `జనతా గ్యారేజ్`తో టాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇచ్చిన తిరుకి తారక్ తో ఇదే రెండో సినిమా కానుండగా.. `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`, `ఆచార్య` తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో తిరుకి నాలుగో సినిమా కానుంది.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న `ఎన్టీఆర్ 30`.. ఏప్రిల్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |