![]() |
![]() |

కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక మందన్న. ఆ తరువాత కన్నడ, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గానే ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రికార్డ్ సాధించింది.
ఇన్స్టాగ్రామ్ లో రష్మిక ఫాలోవర్స్ సంఖ్య 19 మిలియన్లకు చేరుకుంది. అతి తక్కువ కాలంలోనే ఇంత మంది ఫాలోవర్లను పెంచుకోవడం రష్మికకే చెల్లింది. ప్రస్తుతం రష్మిక ఖాతాలో 19.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదోకటి పోస్ట్ చేస్తూ రెగ్యులర్ గా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. మధ్య మధ్యలో లైవ్‌లోకి వచ్చి పలరిస్తుంది.. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా పెడుతుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక త్వరలోనే ఇన్‌స్టాలో 20 మిలియన్ మార్క్ ని టచ్ చేసే అవకాశముంది.
ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప'.. శర్వనంద్ జోడిగా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమాల్లో నటిస్తోంది. హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో నటిస్తోంది.
![]() |
![]() |