Home  »  News  »  అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా: మంచు విష్ణు

Updated : Jul 12, 2021

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష బరిలో నిలవనున్నట్లుగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత, హేమ, సీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ప్రకటించారు. ఇంతమంది బరిలో నిలవడం.. ఇప్పటికే ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మొదలవ్వడం చూస్తుంటే.. ఈసారి మా పోరు మరింత రసవత్తరంగా ఉంటుందనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మా ఎన్నికలపై మంచు విష్ణు స్పందించారు. సోమవారం ట్విటర్‌ లో ఓ వీడియోను విడుదల చేశారు.

"నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నాన్నగారు 'మా' పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు ఉన్న ప్రతి ప్రెసిడెంట్ మన మా మెంబెర్స్ కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేసారు. మాలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్ళి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం. 'మా' బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ ని నేను నిర్మిస్తాను." అని విష్ణు అన్నారు.

"నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని 'మా' కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ళ సలహాలు పాటిస్తాం.. మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి.. 'మా' ప్రెసిడెంట్ గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను." అని విష్ణు పేర్కొన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.