![]() |
![]() |

`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`, `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయిధరమ్ తేజ్. త్వరలో ఈ యంగ్ హీరో.. `రిపబ్లిక్` సినిమాతో సందడి చేయనున్నాడు. `ప్రస్థానం` ఫేమ్ దేవా కట్టా రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐఏఎస్ అధికారి అభిగా పలకరించబోతున్నాడు సాయితేజ్.
ఇదిలా ఉంటే.. జూన్ 4న `రిపబ్లిక్`ని విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఆ ఆలోచనని విరమించుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా సెప్టెంబర్ 2న `రిపబ్లిక్`ని రిలీజ్ చేసే దిశగా చిత్రబృందం ప్రణాళిక రచిస్తోందట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `రిపబ్లిక్`లో సాయితేజ్ కి జంటగా ఐశ్వర్యా రాజేశ్ నటించగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించారు.
![]() |
![]() |