![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ పెట్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో ఆగింది. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత.. సర్కారు వారి పాట మూవీ షూటింగ్ ఈరోజు(సోమవారం) పునఃప్రారంభించారు.
ఈ సినిమా షూటింగ్‌ను పునఃప్రారంభించినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. 'సూపర్ స్టార్ వేలంపాట మళ్లీ మొదలైంది' అంటూ దర్శకుడు పరశురామ్.. హీరో మహేష్ బాబు కి సన్నివేశాన్ని వివరించే వర్కింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా, ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుత షెడ్యూల్ ను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.
![]() |
![]() |