![]() |
![]() |

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'నారప్ప'. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్'కు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. 'నారప్ప' సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుందా లేక ఓటీటీలో రిలీజ్ కానుందా అనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా చిత్రబృందం చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
'నారప్ప' సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా 'నారప్ప' మూవీ విడుదల కాబోతోంది. జులై 20వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
.jpg)
నారప్ప విడుదల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వెంకటేష్.. ''నారప్ప కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మీ కుటుంబ సభ్యులు, ప్రియమైన వాళ్ళతో కలిసి హాయిగా సినిమా చూసేయండి'' అని పేర్కొన్నారు.
![]() |
![]() |