![]() |
![]() |
.jpg)
రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లేకపోవడంతో తన 'రజని మక్కల్ మండ్రమ్' (ఆర్ఎంఎం)ను రద్దు చేయాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం 'రజనీకాంత్ ఫ్యాన్స్ వెల్ఫేర్ క్లబ్స్' ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఆరోగ్య పరీక్షల అనంతరం గత వారం అమెరికా నుంచి చెన్నై వచ్చిన రజనీ, సోమవారం తన రాఘవేంద్ర కల్యాణమంటపంలో రజని మక్కల్ మండ్రమ్ జిల్లా శాఖల సెక్రటరీలను, ఇతర ఆఫీస్-బేరర్లను కలిశారు.
అనంతరం, "ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టలేక పోతున్నందున, 'ఆర్ఎంఎం' చేయాల్సిన పనేమిటి అనే ప్రశ్న తలెత్తింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం చేయడానికి అనుగుణంగా 'ఆర్ఎంఎం'ను నెలకొల్పి, ఆఫీస్-బేరర్లను నియమించాం. కానీ కాలం కలిసిరాకపోవడంతో మనం అనుకున్నది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన నాకు లేదు. అందుకే, రజనీ మక్కళ్ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. అనుబంధ బృందాలు కూడా ఇక ఏవీ ఉండవు." అని రజనీకాంత్ ప్రకటించారు.
అయితే అభిమానులు రజనీకాంత్ ఫ్యాన్స్ వెల్ఫేర్ క్లబ్స్ ద్వారా సంక్షేమ పనులు కొనసాగిస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ప్రకటనలో వెల్లడించారు.

![]() |
![]() |