![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రస్తుతం `బీస్ట్` చిత్రంతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటిస్తోంది. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 2022 పొంగల్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. `బీస్ట్` తరువాత టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న బైలింగ్వల్ (తెలుగు, తమిళ్) మూవీలో విజయ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విజయ్ భారీ పారితోషికమే అందుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, వంశీ పైడిపల్లి సినిమా తరువాత విజయ్ మరో బైలింగ్వల్ మూవీ చేయబోతున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బేనర్ లో నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే విజయ్, అల్లు అరవింద్ మధ్య ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని వినికిడి. అంతేకాదు.. విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని బజ్. త్వరలోనే గీతా ఆర్ట్స్ - విజయ్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |