![]() |
![]() |

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేసింది బెంగళూరు బ్యూటీ ప్రణీత. వీటిలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన `అత్తారింటికి దారేది` (2013)తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. త్వరలో ప్రణీత రెండు హిందీ చిత్రాలతో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా ఒకే ఓటీటీ వేదికలో మూడు వారాల వ్యవధితో స్ట్రీమ్ కాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. పరేశ్ రావెల్, శిల్పాశెట్టి, రాజ్ పాల్ యాదవ్, జానీ లివర్, అశుతోష్ రాణా వంటి ప్రముఖ నటీనటులతో కలిసి ప్రణీత నటించిన ప్రియదర్శన్ డైరెక్టోరియల్ `హంగామా 2` జూలై 23న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. అలాగే అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ వంటి భారీ తారాగణంతో కలిసి ప్రణీత్ యాక్ట్ చేసిన `భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా` ఆగస్టు 13న అదే ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరి.. మూడు వారాల వ్యవధిలో ఒకే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతున్న ఈ రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్.. ప్రణీతకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
![]() |
![]() |