![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `ఎన్టీఆర్ కథానాయకుడు` (2019)లో అతిలోక సుందరి శ్రీదేవిగా అతిథి పాత్రలో అలరించింది రకుల్ ప్రీత్ సింగ్. కట్ చేస్తే.. త్వరలో బాలయ్య సరసన పూర్తిస్థాయి కథానాయిక పాత్రలో ఆమె సందడి చేయనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `లక్ష్యం`(2007), `లౌక్యం`(2014) చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. `డిక్టేటర్`(2016) తరువాత బాలయ్యతో శ్రీవాస్ చేయబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. అంతేకాదు.. కళాశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య లెక్చరర్ గా కనిపిస్తారని బజ్. కాగా, ఈ చిత్రంలో బాలయ్యకి జంటగా రకుల్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `లౌక్యం` తరువాత సరైన విజయం లేని శ్రీవాస్ కి రకుల్ ఫ్యాక్టర్ మరోసారి ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. బాలయ్య చేతిలో ప్రస్తుతం `అఖండ` ఉండగా.. రకుల్ హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే, `అఖండ` తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి కాంబినేషన్స్ లో బాలకృష్ణ తన నెక్స్ట్ వెంచర్స్ చేయబోతున్నారు.
![]() |
![]() |