![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న `నారప్ప`, `దృశ్యం 2` చిత్రాలు తక్కువ గ్యాప్ లోనే రెండు వేర్వేరు ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ కాబోతున్నాయని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక నిర్మాణదశలో ఉన్న `ఎఫ్ 3`.. ఏడాది చివరలో రిలీజయ్యే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే.. 2022లోనూ వెంకీ త్రిచిత్ర ప్రణాళికతో అలరించనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఒకవైపు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `డ్రైవింగ్ లైసెన్స్`ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న ఈ దగ్గుబాటి వారి హ్యాండ్సమ్ హీరో.. మరోవైపు `పెళ్ళిచూపులు` దర్శకుడు తరుణ్ భాస్కర్ తోనూ, అలాగే `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలోనూ నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు చిత్రాలు కూడా ఈ సంవత్సరాంతంలోగానీ, వచ్చే ఏడాది ఆరంభంలోగానీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు. అంతేకాదు.. 2022 విడుదల లక్ష్యంగా ఈ సినిమాలు రూపొందనున్నాయట. మరి.. వెంకీ త్రిచిత్ర ప్రణాళికలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
![]() |
![]() |