![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడిని రాజేస్తున్నాయి. నటులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ ను.. నాన్ లోకల్ అంటూ పలువురు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు సుమన్ దీనిపై స్పందిస్తూ.. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలేనని అన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగానే మా ఎన్నికల గురించి కూడా పరోక్షంగా స్పందించారు. అందరూ కలసికట్టుగా ఉండాలని.. లోకల్- నాన్ లోకల్ అనే భావన వద్దని సూచించారు. వైద్యులు, రైతులు కూడా నాన్ లోకల్ అనుకుంటే.. ప్రజలకు చికిత్స, ఆహారం అందదని వ్యాఖ్యానించారు.
దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలేనని అంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యాఖ్యలతో పరోక్షంగా ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపిన సుమన్.. ముందు ముందు ప్రత్యక్షంగానూ మద్దతుగా నిలుస్తారేమో చూడాలి.
![]() |
![]() |