![]() |
![]() |

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుజీ విజువల్స్ బ్యానర్ పై మురళీరాజ్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. ఆయన హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు.
జూలై 2 జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించనున్న రెండో చిత్రాన్ని గురువారం ప్రకటించారు. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి 'దక్షిణ' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఓషో తులసీరామ్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.
కాగా, ఓషో తులసీరామ్ గతంలో ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మంత్ర' సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఆయన ఛార్మితో 'మంగళ' సినిమా కూడా తీశారు.
![]() |
![]() |