![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్.. త్వరలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`గా పలకరించబోతున్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో సందడి చేయనున్నాడు అఖిల్. ఈ సినిమా విడుదలయ్యేలోపే.. తన నెక్ట్స్ వెంచర్ `ఏజెంట్`ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడీ యంగ్ హీరో. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న ఈ స్పై థ్రిల్లర్ లో స్పైగా దర్శనమివ్వనున్నాడు అఖిల్.
ఇదిలా ఉంటే.. `ఏజెంట్`తో పాటు మరో సినిమాని కూడా పట్టాలెక్కించే దిశగా ప్రణాళిక చేస్తున్నాడట అఖిల్. ఆ వివరాల్లోకి వెళితే.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అఖిల్ ఓ చిత్రం చేయబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించనున్నారట. అంతేకాదు.. శ్రీను వైట్ల కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా నిలిచిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఆనందం` తరహాలో ఈ సినిమా ఉంటుందంటున్నారు. త్వరలోనే అఖిల్ - శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది.
కాగా, శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణుతో `డి అండ్ డి` (డబుల్ డోస్) చేస్తున్నారు. అదయ్యాకే అఖిల్ మూవీ షురూ అయ్యే ఛాన్స్ ఉండొచ్చంటున్నారు.
![]() |
![]() |