Home

»

Latest News

రెట్రో స్పైగా క‌ళ్యాణ్ రామ్?

Jun 30, 2021 2:17PM

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచే క‌థానాయ‌కుల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ హీరో.. `బింబిసార‌` అనే ఓ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ రామ్ తాజాగా మ‌రో కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశ‌మిచ్చాడ‌ట‌. అంతేకాదు.. ఇదో డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ అని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల న‌వీన్ అనే యువ‌కుడు క‌ళ్యాణ్ రామ్ ని సంప్ర‌దించి 1950 నేప‌థ్యంలో సాగే ఓ స్పై థ్రిల్ల‌ర్ ని నేరేట్ చేశాడ‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో క‌ళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అంతేకాదు.. ఇందులో త‌నెప్పుడూ చేయ‌ని రెట్రో స్పై రోల్ లో క‌ళ్యాణ్ రామ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. కాగా, అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ రామ్ - న‌వీన్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్న క‌ళ్యాణ్‌.. స‌ద‌రు ప్రాజెక్ట్ తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com