Home

»

Latest News

షారుక్‌తో తాప్సీ.. నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్?

Jun 30, 2021 3:06PM

తెలుగులో గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమిత‌మైన తాప్సీ.. హిందీనాట మాత్రం అందుకు భిన్నంగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో  `ర‌ష్మీ రాకెట్`, `లూప్ ల‌పేటా`, `దోబారా`, `శ‌భాష్ మిథు` వంటి క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మ‌రోవైపు ద‌క్షిణాదిలోనూ రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వీట‌న్నింటిలోనూ తాప్సీ న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తాప్సీకి ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ట‌. అది కూడా.. స్టార్ హీరో - స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న సినిమాలో. ఆ వివ‌రాల్లోకి వెళితే.. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా హిందీనాట ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం విదిత‌మే.

కాగా, సెప్టెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం తాప్సీని వ‌రించింద‌ని బాలీవుడ్ ఖ‌బ‌ర్. అదే గ‌నుక నిజ‌మైతే.. తాప్సీకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. అంతేకాదు.. నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో ఆమె క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి చాలా కాలం క్రిత‌మే షారుక్ - హిరాణి చిత్రంలో తాప్సీ పేరు వినిపించింది. ఇప్పుడు మ‌రోసారి ఆమె పేరు ప్ర‌చారంలోకి రావ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.  త్వ‌ర‌లోనే షారుక్ - హిరాణి కాంబినేష‌న్ మూవీలో తాప్సీ ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com