![]() |
![]() |

ఈ ఏడాది 'నాంది' మూవీతో సూపర్ హిట్ కొట్టి.. సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు అల్లరి నరేష్. నాంది సినిమాలో తన నటనతో.. ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నరేష్.. తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'సభకు నమస్కారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
నేడు(జూన్30) నరేష్ పుట్టినరోజు సందర్భంగా 'సభకు నమస్కారం' సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నరేష్ స్జేజ్ పై మైక్ ముందు నిలబడి చేతులెత్తి దండం పెడుతున్నాడు. ఓ వైపు జేబులో నోట్ల కట్టలు, మరోవైపు జేబులో మందు సీసా ఉన్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎక్కువగా రాజకీయ నాయకులు డబ్బు, మద్యాన్నే నమ్ముకుంటారన్న సంగతి తెలిసిందే. పోస్టర్ చూస్తుంటే ‘సభకు నమస్కారం’ పొలిటికల్ సెటైర్ మూవీగా రూపొందనుందని అర్థమవుతుంది.

నరేష్ 58వ మూవీగా తెరకెక్కుతున్న 'సభకు నమస్కారం'తో సతీష్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి మహేష్ కోనేరు నిర్మాత. అబ్బూరి రవి ఈ సినిమాకు మాటలను అందిస్తున్నాడు. సెప్టెంబర్ రెండో వారాంలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
![]() |
![]() |