![]() |
![]() |

కొన్ని ఆన్ స్క్రీన్ పెయిర్స్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వాటిలో విజయ్ దేవరకొండ- రష్మికా మందన్న జంట ఒకటి. విజయ్ తక్కువ టైంలో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకోగా.. రష్మిక నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి పండగే. 'గీతగోవిందం' సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తరువాత 'డియర్ కామ్రేడ్' మూవీలో కలిసి నటించారు. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ.. విజయ్-రష్మికల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
విజయ్- రష్మికల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చింది రెండు సినిమాలే గాని ఈ జంటకి విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వస్తుంటాయి. అయితే విజయ్- రష్మికలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తుంటారు. అయితే అసలు విజయ్ తో తనకున్న రిలేషన్ ఏంటో రష్మిక తాజాగా చెప్పేసింది. రష్మిక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ విజయ్ గురించి ప్రశ్నలు అడిగారు. విజయ్ మీకు ఎంత స్పెషలో చెప్పగలరు? అంటూ ఒక ఫ్యాన్ అడగగా.. "విజయ్ అంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. విజయే నా బెస్ట్ ఫ్రెండ్" అని రష్మిక చెప్పింది. అలాగే, విజయ్ తో దిగిన ఫొటోల్లో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది? అని ఒక ఫ్యాన్ అడగగా.. "డియర్ కామ్రేడ్ సమయంలో.. కొచ్చిలో జరిగిన ఆ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ్ తో తీసుకున్న ఈ ఫొటో నాకెంతో ఇష్టం." అంటూ రష్మిక విజయ్ తో దిగిన ఫోటోను పంచుకుంది.
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమాలు మిషన్ మజ్ను, గుడ్ బై లలోనూ నటిస్తోంది.
![]() |
![]() |