![]() |
![]() |

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ వీడియో విడుదలైంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'జయ జయ మహావీర' అనే మొదటి పాట లిరికల్ వీడియో విడుదలైంది. శ్రీరాముడి ఘనతను చాటిచెప్పే 11వ శతాబ్దపు రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు. ఈ గీతానికి ఇళయరాజా అందించిన ట్యూన్ ఆకట్టుకుంటోంది. ‘జయ జయ మహావీర’ అంటూ సాగే ఈ పాటని యువ గాయకుడు రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ సాంగ్ లో మోహన్ బాబు.. వేంకటేశ్వరస్వామి దీక్షా వస్త్రాలతో కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
'జయజయ మహావీర' పాటని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విడుదల చేయడం విశేషం. ఈ పాటను విడుదల చేసిన బిగ్ బి.. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేస్తూ.. "భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు.. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన 'రఘువీరా గద్యం'లోని పాట ఈ 'జయ జయ మహావీర'. ఆల్ ది బెస్ట్.." అని పేర్కొన్నారు.
![]() |
![]() |