![]() |
![]() |

సంక్రాంతి బ్లాక్ బస్టర్ `క్రాక్`లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఆకట్టుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన `ఖిలాడి` చేస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు రవితేజ. అయితే, ఆ పాత్రలేంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, `ఖిలాడి` తరువాత రవితేజ నుంచి రానున్న కొత్త చిత్రంలో మాత్రం ఆయన ప్రభుత్వ అధికారి పాత్రలో దర్శనమివ్వనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 90ల నాటి కథాంశంతో తెరకెక్కనున్న ఈ పిరియడ్ డ్రామాలో రాయలసీమకు చెందిన వ్యక్తిగా, ప్రభుత్వ అధికారిగా మాస్ మహారాజా కనిపిస్తారట. అంతేకాదు.. వాస్తవ ఘటనల చుట్టూ అల్లుకున్న ఈ పాతికేళ్ళ క్రితం నాటి కథాంశంలో ఇదివరకెన్నడూ దర్శనమివ్వని లుక్ లో రవితేజ ఎంటర్టైన్ చేయనున్నారట. మరి.. ఈ కొత్త తరహా పాత్రలో రవితేజ ఏ స్థాయిలో రంజింపజేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. రవితేజ - శరత్ మండవ కాంబినేసన్ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. సామ్ సి.ఎస్. బాణీలు అందిస్తున్నారు. `మజిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఇందులో ఓ నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
![]() |
![]() |