![]() |
![]() |

మహేశ్ భార్యగా నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని వారింట అడుగుపెట్టాక.. ఆ ఫ్యామిలీలో ఆమె ఎలా ఇముడుతుందోనని అనేకమంది సందేహపడ్డారు. ఆమె నార్త్ నుంచి రావడం, మన ఆచార వ్యవహారాలకు భిన్నమైన నేపథ్యం నుంచి రావడం దీనికి కారణం. కానీ చాలా తక్కువ కాలంలోనే నమ్రత.. ఘట్టమనేని కుటుంబీకుల ఆదరాభిమానాలు చూరగొంది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ, అందరినీ కలుపుకుపోతూ, అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ వచ్చిన ఆమె ఇవాళ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ కోడలిగా, యంగ్ సూపర్‌స్టార్ మహేశ్ భార్యగా మంచి గౌరవాన్ని పొందుతోంది.
మహేశ్ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగడానికి నమ్రత ప్రధాన కారణమని సన్నిహితులు చెబుతుంటారు. ప్రొఫెషనల్‌గా మహేశ్ ఎలాంటి వత్తిడికీ గురికాకుండా చూసుకుంటున్న ఆమె, అతడి బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను పర్యవేక్షిస్తోంది. ఓవైపు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే, మరోవైపు బిజినెస్ వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా నేనున్నానంటూ కృష్ణ కుటుంబంలోని మిగతావారికి అండగా కూడా ఆమె నిలుస్తూ వస్తోంది. అనేక సందర్భాల్లో నమ్రత సలహాలను వారు తీసుకుంటూ వచ్చారు. మహేశ్ అక్క మంజులతో నమ్రత చాలా సన్నిహితంగా మెలగుతుంటుంది.
నమ్రత అంటే ఏమిటో మరోసారి మంజుల తెలియజేశారు. గురువారం నమ్రతతో తను కలిసున్న ఓ పిక్చర్‌ను ఆమె తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దాంతో పాటు, "నమ్రతతో నా టైమ్‌ను ఎంజాయ్ చేస్తాను. ఆమె కేవలం నా మరదలు మాత్రమే కాదు, ఓ మంచి ఫ్రెండ్ కూడా. ఆమె నా పక్కనుంటే చాలా బాగుంటుంది. ఈ సూపర్‌వుమన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది." అని ఆమె రాసుకొచ్చారు. అంతేకాదు, "మీ జీవితంలోని సూపర్‌వుమన్ ఎవరు, ఆమెలో మీకు నచ్చినదేంటి? మీ కామెంట్స్‌ను చదవడానికి ఇష్టపడతాను." అని కూడా తెలిపారు.
![]() |
![]() |