![]() |
![]() |

సినీ సెలెబ్రిటీల మీద రూమర్స్ రావడం కామన్. ఇటీవల సీనియర్ నటి ప్రేమపై కూడా రూమర్స్ వచ్చాయి. ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందని, ఆమె అనారోగ్యం పాలైందని ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వార్తలను ఖండించారు ప్రేమ.
తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రేమ చెప్పారు. ప్రస్తుతం తాను ఒంటరిగా, సంతోషంగా ఉన్నానని.. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తెలిపారు. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను కూడా నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు.
కాగా, ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మనస్పర్ధలతో 2016లో విడాకులు తీసుకున్నారు.
![]() |
![]() |