![]() |
![]() |

సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నివేథా థామస్ కు డైరెక్షన్ చేయాలని ఉందట. ఇప్పటికే డైరెక్షన్ కోర్సు కూడా పూర్తి చేసిన ఈ యంగ్ బ్యూటీ.. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం వహిస్తానని చెబుతోంది.
2016లో 'జెంటిల్ మెన్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేథా.. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలు చేజిక్కించుకొని నిన్నుకోరి, జైలవకుశ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో అలరించింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది.
గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకొని సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ సక్సెస్ అయిన నివేథా.. ఫ్యూచర్ లో తప్పకుండా డైరెక్టర్ గాను లక్ టెస్ట్ చేసుకుంటానని చెబుతోంది. ఒకవైపు నటిగా సినిమాలు చేస్తూనే మధ్యలో డైరెక్షన్ కోర్సు కూడా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని చెబుతోంది. ముందుగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి, ఆ తర్వాత సినిమాలకి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపింది. నివేథా డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.
![]() |
![]() |