![]() |
![]() |

కరోనా సమయంలో సామాన్యులకు అండగా ఉంటూ రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్ ను కలవడానికి తెలంగాణకు చెందిన ఓ యువకుడు పాదయాత్రగా వెళ్తున్నాడు. సోనూసూద్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర మొదలు పెట్టాడు.
వికారాబాద్ జిల్లా దోర్నాలపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకటేష్.. సోనూసూద్ ను కలవాలని ముంబైకు పాదయాత్రగా వెళ్తున్నాడు. వెంకటేష్ తండ్రి హైదరాబాద్ లో ఆటో నడుపుతుంటారు. అయితే ఫైనాన్స్ డబ్బులు కట్టకపోవడంతో తన తండ్రి ఆటోను ఫైనాన్సియర్లు తీసుకెళ్లారు. దీంతో సోనూసూద్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేష్ పాదయాత్ర ప్రారంభించాడు.
సోనూసూద్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న వెంకటేష్.. దేశం మొత్తానికి సాయం చేసిన ఆయన తనకు దేవుడితో సమానమని చెప్పాడు. ఆ దేవుడిని కలిసి తన బాధను చెప్పుకుంటానని అంటున్నాడు. పాదయాత్రలో భాగంగా రోజూ 40 కి.మీ నడుస్తున్నానని, సోనూసూద్ ఫొటో చూసి దారిలో చాలామంది తనకు సాయం చేస్తున్నారని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |