![]() |
![]() |

పల్లె టూళ్లలో ఆరు బయట మంచం వేసుకొని చల్లగాలిని ఆస్వాదిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ ఆనందాన్ని సిటీలో ఉండేవాళ్ళు.. ముఖ్యంగా సెలెబ్రిటీల పిల్లలు పొందలేరు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన పిల్లలకి ఆ ఆనందాన్ని పంచారు. ఆరు బయట నవారు మంచం మీద పడుకొని పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపారు.

సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. ఏ మాత్రం సమయం దొరికినా పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు తన పిల్లలు అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన బన్నీ.. పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బన్నీ తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో ఆరు బయట నవారు మంచం మీద పడుకొని ముచ్చటిస్తున్న వీడియోని బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బన్నీ ఆకాశంలో ఏదో చూపిస్తూ పిల్లలతో సరదాగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ మూవీ పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
![]() |
![]() |