![]() |
![]() |

`స్పైడర్` (2017).. స్టార్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ రూపొందించిన తొలి బైలింగ్వల్ మూవీ ఇది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. అయినప్పటికీ, స్వల్ప విరామం అనంతరం మరో బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణకు వెళ్ళనుంది. ఈ లోపే, మురుగదాస్ చెప్పిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా నచ్చడంతో.. మరో బైలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రామ్. అంతేకాదు.. మురుగదాస్ హోమ్ బేనర్ లో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుందట.
కాగా, తెలుగు కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి (స్టాలిన్), సూపర్ స్టార్ మహేశ్ బాబు(స్పైడర్)తో మురుగదాస్ చేసిన సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. రామ్ తో చేయనున్న ఈ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |