![]() |
![]() |

బాలనటుడిగానూ, కథానాయకుడిగానూ తనదైన ముద్రవేసిన తరుణ్.. రీసెంట్ గా ఆహాలో స్ట్రీమ్ అయిన మలయాళ అనువాద చిత్రం `అనుకోని అతిథి` కోసం `డబ్బింగ్ ఆర్టిస్ట్` అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కి తన గాత్రమందించాడు తరుణ్. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో.. మరోమారు ఫాహద్ ఫాజిల్ కి వాయిస్ ఇచ్చే అవకాశం దక్కిందని టాక్. ఈ సారి ఏకంగా.. ఓ పాన్ - ఇండియా మూవీ కోసం తరుణ్ డబ్బింగ్ చెప్పనున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో `పుష్ప` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కాగా, `అనుకోని అతిథి`లో ఫాహద్ కి తరుణ్ డబ్బింగ్ చెప్పిన విధానం నచ్చి.. `పుష్ప`లోనూ తన వాయిస్ నే కంటిన్యూ చేయమని యూనిట్ సంప్రదించిందట. తరుణ్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడని బజ్. కాకపోతే, `అనుకోని అతిథి`లో ఫాహద్ హీరో కాగా.. `పుష్ప`లో విలన్. ఏదేమైనా, `పుష్ప`తోనూ తరుణ్ ఇంప్రెస్ చేయగలిగితే.. తరుచుగా తన గాత్రాన్ని `డబ్బింగ్` రూపంలో వినగలిగే అవకాశం అతని అభిమానులకు దక్కినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |