![]() |
![]() |

`చంకీ పాండే తనయ` అనే ట్యాగ్ తో బాలీవుడ్ లో కథానాయికగా తొలి అడుగేసింది అనన్యా పాండే. కరణ్ జోహార్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`తో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆపై `పతీ పత్ని ఔర్ వో`, `ఖాళీ పీలీ` చిత్రాలతో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ `లైగర్`లో రౌడీ హీరో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తోంది. అలాగే `కపూర్ అండ్ సన్స్` ఫేమ్ షకున్ బాత్రా తెరకెక్కిస్తున్న పేరు నిర్ణయించని సినిమాలోనూ నటిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేదికి జంటగా దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. షకున్ బాత్రా డైరెక్టోరియల్ రిలీజ్ కాకముందే సిద్ధాంత్ తో మరో సినిమాలో కలిసి నటించేందుకు సిద్దమైంది అనన్య. ఆ వివరాల్లోకి వెళితే.. `జిందగీ న మిలేగి దోబరా`, `దిల్ ధడ్కనే దో`, `గల్లీ బాయ్` చిత్రాల దర్శకురాలు జోయా అఖ్తర్.. త్వరలో తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇందులో సిద్ధాంత్, అనన్య మరోమారు జట్టుకట్టనున్నారని బాలీవుడ్ ఖబర్. మరి.. సిద్ధాంత్, అనన్య జోడీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |