![]() |
![]() |

`హ్యాపీడేస్` (2007)తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. `యువత`(2008)తో కథానాయకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆపై `స్వామి రా రా` (2013), `కార్తికేయ` (2014), `ఎక్కడికి పోతావు చిన్నవాడా` (2016), `అర్జున్ సురవరం` (2019).. వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా, సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేసే నిఖిల్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు మీదున్నాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రచనలో తెరకెక్కుతున్న `18 పేజీస్`తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. ఆపై తన లక్కీ డైరెక్టర్స్ చందు మొండేటి, సుధీర్ వర్మతో వేర్వేరు ప్రాజెక్ట్స్ కోసం మరోమారు జట్టుకట్టనున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో `కార్తికేయ 2` చేయనున్న నిఖిల్.. ఆనక సుధీర్ వర్మ దర్శకత్వంలో బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న మూవీ చేయనున్నాడు. అలాగే ఓ `స్పై` మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా.. ఏషియన్ సంస్థలోనూ ఓ సినిమాకి సంతకం చేశాడు నిఖిల్.
మొత్తమ్మీద... వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నిఖిల్.. రాబోయే సినిమాలని మంచి లైనప్ తోనే సెట్ చేసుకుంటుండడం విశేషం. మరి.. ఈ చిత్రాలతో నిఖిల్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |