![]() |
![]() |

కోవిడ్ ఎఫెక్ట్ తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే జాబితాలో.. మరో టాలీవుడ్ మూవీ చేరనుందని ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. హిందీనాట ఘనవిజయం సాధించిన `అంధాధున్` చిత్రాన్ని తెలుగులో `మాస్ట్రో` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అతనికి జోడీగా `ఇస్మార్ట్` పోరి నభా నటేశ్ సందడి చేయనుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దర్శనమివ్వనుంది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా`, `కృష్ణార్జున యుద్ధం` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమాకి సంబంధించి కేవలం ఏడు రోజుల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని ఇటీవల దర్శకుడు మేర్లపాక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా `మాస్ట్రో` టీమ్ ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తోందని.. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ వేదిక నుంచి మంచి ఆఫర్ కూడా అందిందని వినిపిస్తోంది. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
కాగా, `మాస్ట్రో`కి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నాడు.
ఓటీటీ దారిలో `మాస్ట్రో`?
![]() |
![]() |