![]() |
![]() |

ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న ధనుష్ ఫిల్మ్ 'జగమే తందిరమ్' ట్రైలర్ మంగళవారం విడుదలైంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' యాక్టర్ జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి లాంటి పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ మూవీ జూన్ 18న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతోంది. కానీ ఈ ఫిల్మ్ నేరుగా ఓటీటీలో రిలీజవుతుండటం ధనుష్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. థియేటర్లలో రిలీజైతే ఈ సినిమా మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆయన భావిస్తున్నాడు.
'జగమే తందిరమ్' ట్రైలర్‌ను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ షేర్ చేసిన తర్వాత, ఆ ట్రైలర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు ధనుష్. ఆ పోస్ట్‌లో సినిమా థియేటర్లలో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతున్నందుకు తన అయిష్టతను వ్యక్తం చేశాడు. ట్రైలర్‌ను షేర్ చేస్తూ, "ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ నెట్‌ఫ్లిక్స్‌కు రావడం ఎలా ఉంటుంది. అయినప్పటికీ 'జగమే తందిరమ్'ను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను." అని రాసుకొచ్చాడు. దాంతో ఆ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటాన్ని ఆయన ఎంతగా వ్యతిరేకిస్తున్నాడో అర్థమవుతోంది.
'జగమే తందిరమ్' మూవీ గత ఏడాదే థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ మహమ్మారి దెబ్బకు పోస్ట్‌పోన్ అయింది. ఈ ఏడాదైనా విడుదల చేద్దామనుకుంటే కరోనా సెకండ్ వేవ్ ఆ అవకాశాల్ని దెబ్బ కొట్టింది. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాత శశికాంత్ నిర్ణయించుకున్నారు. ఇది ధనుష్‌కు ఏమాత్రం రుచించలేదు.
.jpg)
గ్యాంగ్‌స్టర్ మూవీగా రూపొందిన 'జగమే తందిరమ్'లో ధనుష్ తన సిగ్నేచర్ రోల్‌లో కనిపించనుండగా, విలన్ పాత్రను జేమ్స్ కాస్మో పోషించాడు. కార్తీక్ సుబ్బారాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సంచనా నటరాజన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, కలైఅరసన్, వడివుక్కరసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం 6 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్‌కు 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
![]() |
![]() |