![]() |
![]() |

`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`.. వంటి హ్యాట్రిక్ విజయాల అనంతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి రాబోతున్న సినిమా `సర్కారు వారి పాట`. ఇందులో మహేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. `గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత పరశురామ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంతమేర చిత్రీకరణ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట`కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. జూలై నుంచి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ జరుపనున్నారని టాక్. అంతేకాదు.. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియో లో స్పెషల్ సెట్ వేశారట. ఈ సెట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని వినికిడి.
కాగా, `సర్కారు వారి పాట`ని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సీజన్ లో వచ్చిన మహేశ్ చిత్రాల్లో సింహభాగం విజయపథంలో పయనించిన నేపథ్యంలో.. `సర్కారు వారి పాట`కి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగుతుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
![]() |
![]() |