![]() |
![]() |

దర్శకురాలిగా నందినీ రెడ్డిది పదేళ్ళ ప్రస్థానం. 2011లో విడుదలైన `అలా మొదలైంది`తో డైరెక్టర్ గా తొలి అడుగేసిన నందిని.. ఆపై `జబర్దస్త్`, `కళ్యాణ వైభోగమే`, `ఓ బేబి` చిత్రాలతో సందడి చేశారు. వీటిలో `జబర్దస్త్` తేడా కొట్టినా.. మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ రూపొందించిన తొలి తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ `పిట్టకథలు` ఆంథాలజీ కోసం `మీరా` అనే సెగ్మంట్ చేశారు నందిని.
ఇదిలా ఉంటే.. `మహానటి`, `జాతిరత్నాలు` వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన స్వప్న సినిమా సంస్థలో నందిని తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. తన గత సినిమాల తరహాలోనే ఇది కూడా ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. కాగా, ఇందులో `ఏక్ మినీ కథ` ఫేమ్ సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించబోతున్నాడట. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు, గీతా ఆర్ట్స్ లోనూ నందినీ ఓ మూవీ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా 2022లో సెట్స్ పైకి వెళుతుందని బజ్.
![]() |
![]() |