![]() |
![]() |

హీరోయిన్ ప్రణీత సుభాష్ సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ ప్రైజ్ చేసింది. బిజినెస్ మ్యాన్ నితిన్ తో ప్రణీత వివాహం ఆదివారం(మే 30) జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రణీత- నితిన్ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరోనా కారణంగా అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ప్రణీత- నితిన్ వేడుక జరిగిందని సమాచారం. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇంత సడెన్ గా, సైలెంట్ గా పెళ్లి కావడంతో ప్రస్తుతం ప్రణీత పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా, 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత 'బావ', 'అత్తారింటికి దారేది', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి చిత్రాలలో అలరించింది. ఇటీవల సినిమాలు తగ్గినప్పటికీ.. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి ప్రణీత నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానుల మనసు గెలుచుకుంటోంది. మరి ఇప్పుడు పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన ప్రణీత.. వివాహం తర్వాత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |