![]() |
![]() |

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్. బాహుబలితో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఆయనను అభిమానించే వారు ఎందరో ఉంటారు. అయితే ఆయన తండ్రి సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాత్రం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జపం చేస్తున్నారు.
తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ తన అభిమాన దర్శకుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అని అలీ అడిగినప్పుడు.. పూరి జగన్నాధ్ అని విజయేంద్ర ప్రసాద్ వెంటనే సమాధానం ఇచ్చారు. అంతేకాదు పూరి నా శత్రువు, పూరి అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను అంటూ తన ఫోన్ ను చూపించడం విశేషం.

కాగా, పూరి జగన్నాధ్ కి యూత్ లో బోలెడంత క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయనను పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు. అయితే పూరిని అభిమానించే వారి లిస్ట్ లో రాజమౌళి తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఉండటం ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |