![]() |
![]() |

విభిన్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సత్యదేవ్. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ కి బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'రామ్ సేతు'. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా రేంజ్ లో అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాత్రల కోసం తమిళం నుండి సీనియర్ నటుడు నాజర్, తెలుగు నుండి సత్యదేవ్ లను తీసుకున్నారట.
కాగా, సత్యదేవ్ గతంలో ది ఘాజీ ఎటాక్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు 'రామ్ సేతు'తో హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |