![]() |
![]() |

ఎలాగైతే ప్రముఖ గాయకులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఇచ్చారో, అలాగే నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలనీ, అది తెలుగువారందరికీ గర్వకారణమవుతుందనీ మెగాస్టార్ చిరంజీవి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం (మే 28) దివంగత విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయనను తలచుకుంటూ చిరంజీవి ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
"ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.." అని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ నోట్‌ను పోస్ట్ చేశారు చిరంజీవి.

![]() |
![]() |