![]() |
![]() |

వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ రూపొందించిన `గ్యాంగ్ లీడర్` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. నటిగా ప్రియాంకకి మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. ఆపై శర్వానంద్ నటించిన `శ్రీకారం` చిత్రంలోనూ ప్రియాంక సందడి చేసింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లోనూ వరుస సినిమాలతో సందడి చేయనుంది. శివకార్తికేయన్ సరసన ఆడిపాడిన `డాక్టర్` విడుదలకు సిద్ధమవగా, అతనితోనే `డాన్` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య కి జోడీగా ఓ చిత్రం చేస్తోంది ప్రియాంక.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగులో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ప్రియాంక. ఆ వివరాల్లోకి వెళితే.. యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో `థాంక్ యూ` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీ ఖన్నా, మాళివికా నాయర్, అవికా గోర్ నాయికలుగా నటిస్తున్నారు. కాగా, కథను కీలక మలుపు తిప్పే అతిథి పాత్రలో ప్రియాంక దర్శనమివ్వనుందని టాక్. త్వరలోనే `థాంక్ యూ`లో ప్రియాంక స్పెషల్ అప్పీయరెన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
`థాంక్ యూ`ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |