![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు ప్రభాస్. `తానాజీ` ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని టి-సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో `ఆదిపురుష్` తెరకెక్కుతోంది. ప్రధానంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న `ఆదిపురుష్`.. పాన్-ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. `ఆదిపురుష్`లో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహమ్ ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. వాస్తవానికి, కొద్ది నెలల క్రితం ప్రభాస్ `సలార్`లో జాన్ విలన్ గా నటించబోతున్నట్లు కథనాలు వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకముందే.. ఇప్పుడు `ఆదిపురుష్`లో జాన్ నటించబోతున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే `ఆదిపురుష్`లో జాన్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, `ఆదిపురుష్`లో సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్` థియేటర్లలో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |