![]() |
![]() |

హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన నటి గౌతమి.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మొత్తం కలిపి 120కి పైగా చిత్రాల్లో నటించారు. అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు. తన వ్యక్తిగత, సినిమా సంగతులను పంచుకున్న గౌతమి.. ఓ సినిమా షూటింగ్ లో శుభలేఖ సుధాకర్ తనకు సారీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
'ద్రోహి' సినిమాలో శుభలేఖ సుధాకర్ టెర్రరిస్ట్ పాత్రలో నటించారని.. షూటింగ్ లో భాగంగా ఆయన తన ఇంట్లోకి ప్రవేశించి తనను బలవంతం చేసే సన్నివేశంలో నటించారని.. నిజంగానే సన్నివేశంలో లీనమై చేశారని.. ఆ తరువాత కట్ చెప్పగానే ''ఐయామ్ సో సారీ..'' అంటూ ఎన్ని సార్లు చెప్పారో అంటూ నవ్వుతూ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
రజినీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన గౌతమి.. చిరంజీవితో మాత్రం సినిమా చేయలేదు. ఈ విషయంపై ఆమెని ప్రశ్నించగా.. మెగాస్టార్ తో రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయానని చెప్పుకొచ్చారు. టి. సుబ్బరామిరెడ్డి నిర్మించిన 'స్టేట్ రౌడీ' సినిమా ఆఫర్ ముందుగా తన దగ్గరకే వచ్చిందని.. కానీ డేట్స్ కుదరక చేయలేకపోయానని వెల్లడించారు. చిరంజీవి సినిమాలకు డేట్స్ అడిగిన ప్రతీసారి రజినీకాంత్ సినిమాలతో బిజీగా ఉండేదాన్ని అని అందుకే ఆయనతో సినిమాలు చేయలేకపోయానని ఆమె తెలిపారు.

1989లో బి. గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన 'స్టేట్ రౌడీ' మూవీలో చిరంజీవి సరసన నాయికలుగా రాధ, భానుప్రియ నటించారు. వారిలో ఎవరి క్యారెక్టర్ ముందుగా గౌతమికి వచ్చిందో మాత్రం తెలీదు.
![]() |
![]() |