![]() |
![]() |

గత వారం తమిళ నటి, బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ రైజా విల్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె కన్ను, దాని కింద భాగం అంతా వాచిపోయి ఉంది. చెన్నైకు చెందిన ఓ క్లినిక్‌లో తాను స్కిన్‌కేర్ చికిత్స తీసుకుంటున్నాననీ, దాని కారణంగా తన కంటి కింద భాగం వాచిపోయిందనీ ఆరోపించింది. ఆ తర్వాత తనకు ఆ క్లినిక్ నుంచి రూ. 1 కోటి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతూ కేసు పెట్టింది.
దీనిపై రైజాకు చికిత్స అందిస్తున్న డాక్టర్ భైరవి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, రైజా ముఖంపై వచ్చిన వాపు అనేది సాధారణ సైడ్ ఎఫెక్టేననీ, కొద్ది రోజుల్లో అది తగ్గిపోతుందనీ చెప్పారు.
అనంతరం ఆ లేడీ డాక్టర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైజాపై తాను రూ. 5 కోట్లకు పరువునష్టం దావా వేశానని వెల్లడించారు. "రైజా ఆరోపించినట్లుగా ఆమె కేవలం ఫేసియల్ ట్రీట్‌మెంట్ మాత్రమే తీసుకోలేదు, డెర్మల్ ఫిల్లర్స్ లాంటి ఇతర ట్రీట్‌మెంట్స్ కూడా తీసుకున్నారు. ఆ ప్రొసీజర్స్ తర్వాత చెంపపై వాపులు రావడం, ఎరుపెక్కడం వంటివి సాధారణ సైట్ ఎఫెక్టులు. ఆ ప్రొసీజర్స్ తర్వాత కొన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆమెకు చెప్పాం." అని ఆమె తెలిపారు.
"పొగతాగడం, మద్యం సేవించడం లాంటివి చేయకూడదనీ, విపరీతంగా ఎక్సర్‌సైజులు చెయవద్దనీ.. అలా చేస్తే చర్మ సమస్యలు వస్తాయనీ ఆమెకు చెప్పాం. మా దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే, గత పది సంవత్సరాలుగా ఇతర డాక్టర్ల దగ్గర కూడా అదే తరహా ట్రీట్‌మెంట్స్ తీసుకుంటున్నానని ఆమె స్వయంగా చెప్పారు." అని భైరవి వెల్లడించారు.

ధనుష్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించిన 'విఐపి-2'లో నటించిన రైజా విల్సన్, బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేయడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అనంతరం ఆమె హరీశ్ కల్యాణ్ సరసన నాయికగా 'ప్యార్ ప్రేమ కాదల్' (2018) సినిమా చేసింది.
![]() |
![]() |