![]() |
![]() |

శంకర్ సినిమాలంటేనే భారీతనానికి చిరునామా. పాటలు, పోరాటాలు, దృశ్యాలు.. ఇలా అన్ని కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. తొలి రోజుల నుండి తన శైలి అంతే. కాకపోతే.. ఇటీవల కాలంలో అది కాస్త ఎక్కువైంది. ఒకప్పటి శంకర్ సినిమాల్లో డ్రామా, యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ లో డెప్త్ నెస్ కి పెద్దపీట వేస్తే.. గత కొంతకాలంగా మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ దే ఆధిపత్యం. అయితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ స్టార్ కెప్టెన్ చేయబోయే సినిమా మాత్రం.. వింటేజ్ శంకర్ మార్క్ తోనే రూపొందనుందట. అంతేకాదు.. రీసెంట్ టైమ్స్ లో త్వరితగతిన పూర్తయ్యే శంకర్ మూవీ కూడా ఇదే కావచ్చంటున్నారు.
కాస్త వివరాల్లోకి వెళితే.. `జెంటిల్ మేన్`, `భారతీయుడు`, `ఒకే ఒక్కడు` చిత్రాల తరహాలో `#RC 15` కూడా పవర్ ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ చుట్టే తిరుగుతుందని బజ్. అలాగే, ఆ చిత్రాల తరహాలో డ్రామా, యాక్షన్ సీన్స్ కి మాంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇదని వినికిడి. అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన ఓ అధికారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ చిత్రం థీమ్ అట. అంతేకాదు.. జూన్ లేదా జూలైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏకధాటిగా ఆరు నెలల పాటు మారథాన్ షెడ్యూల్ తో పూర్తిచేసేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుందని టాక్.
మరి.. `#RC 15`తో వింటేజ్ శంకర్ బయటకు వస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం.. 2022 వేసవిలో లేదా ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |