![]() |
![]() |
.jpg)
ఇవాళ సోను సూద్ గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరు. టాలీవుడ్ స్టార్లను మించి జనంలో ఆదరణ సంపాదించుకున్నాడు సోను. దేశంలో కరోనా వల్ల కష్టాలు పడుతున్న వేలాది మందికి ఆయన ఆపద్బాంధవుడు. సాయం కోసం జనం తనను ఎలా అర్థిస్తున్నారో తన ఫోన్‌కు వస్తున్న మెసేజ్‌లలో కొన్నింటిని సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకున్నాడు. "దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సాయం కోసం రిక్వెస్టులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ సాయం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. అందరూ.. దయచేసి ముందుకు రండి. సాయం చేసే చేతులు మనకు మరిన్ని కావాలి. మీ శక్తిసామర్థ్యాలకు తగ్గట్లు మీ వంతు సాయం అందించండి." అని ఆయన అభ్యర్థించాడు.
అంతకు ముందు, సెకండ్ వేవ్ కొవిడ్-19 బారిన పడుతున్న వారిని రక్షించడం ఇచ్చే తృప్తి ఓ పెద్ద బ్లాక్‌బస్టర్ మూవీలో నటించడం ఇవ్వదని ఆయన స్పష్టం చేశాడు. "అర్ధరాత్రి వేళ, అనేక కాల్స్ వస్తున్నప్పుడు అవసరమైన వారికి బెడ్స్ సిద్ధం చేయగలిగితే, కొంతమందికి ఆక్సిజన్ అందించగలిగితే, కొన్ని ప్రాణాలనైనా రక్షించగలిగితే.. నన్ను నమ్మండి.. అది ఏ 100 కోట్ల సినిమాలో భాగం కావడం కంటే కూడా మిలియన్ రెట్లు ఎక్కువగా సంతృప్తినిస్తుంది. ఒక బెడ్ కోసం హాస్పిటల్స్ బయట జనం వెయిట్ చేస్తుంటే, మేం నిద్రపోలేం." అని ట్వీట్ చేశాడు సోను.
ఏడాది పైగా ప్రజలకు తన వంతు సాయం చేయడానికి ఎంత కష్టమైనా పడుతూ వస్తున్నాడు ఈ పరోపకారి నటుడు.
![]() |
![]() |