![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ కు తమిళనాట ఉన్న క్రేజే వేరు. రెండు దశాబ్దాలకు పైగా అక్కడ స్టార్ హీరోగా రాణిస్తున్నారాయన. కాగా, ఈ మే 1న 50వ పుట్టినరోజుని జరుపుకోనున్నారు అజిత్. ఈ లోపే కొత్త సినిమా కబురుని వినిపించేశారు. అంతా అనుకున్నట్లుగానే `ఖాకి` దర్శకుడు హెచ్. వినోద్ తో వరుసగా మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అజిత్. `పింక్` రీమేక్ `నేర్కొండ పార్వై` వీరి కాంబోలో ఫస్ట్ వెంచర్ కాగా.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `వలిమై` సెకండ్ ప్రాజెక్ట్. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా విడుదలయ్యేలోపు.. వినోద్ తోనే మరో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టనున్నారు అజిత్.
జూలై నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక `వలిమై` విషయానికొస్తే.. చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది. మొత్తమ్మీద.. వరుసగా మూడు చిత్రాలను ఒకే దర్శకుడితో, ఒకే నిర్మాణ సంస్థ (బోనీకపూర్ బేనర్)లో అజిత్ చేస్తుండడం టాక్ ఆఫ్ కోలీవుడ్ అవుతోంది.
![]() |
![]() |